ఇండియన్ సినిమా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమా? ఆయన పేరు సినీ ప్రపంచంలో ఓ బ్రాండ్. ఎప్పటివరకు హిందీ సినిమాల్లో మాత్రమే కనిపించిన బిగ్ బి, ఇప్పుడు భాషల గడలు దాటుతూ తెలుగు సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక ప్రేమ కారణంగా, ఆయన నటించిన సినిమాలు తెలుగులో మంచి విజయం సాధిస్తున్నాయి.
మనం సినిమాలో చిన్న పాత్ర చేసినా, సైరా నరసింహా రెడ్డి లో గోసాయి వెంకన్న పాత్రలో ఆకట్టుకున్నారు. 2024 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ లో అశ్వద్ధామ గా నటించి థియేటర్లను దద్దరిల్లు చేశారు. ఆయన నటన చూసిన ప్రేక్షకులు సినిమా హాల్‌లో హర్షధ్వానాలు చేశారు. అశ్వద్ధామ అంటే అమితాబ్ బచ్చన్ ను గుర్తుచేసేలా శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
అలాగే, 2024లో ఏఎన్నార్ అవార్డు వేడుకలో “నేను తెలుగు నటుడినే, నన్ను గుర్తుంచుకోండి” అంటూ చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. తెలుగు దర్శకులు అమితాబ్ టాలెంట్ ను మంచిగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా, విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ సినిమాకు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 1850 నాటి కథ లో వేరే లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం.
మొత్తానికి, టాలీవుడ్ లో బిగ్ బి ప్రభావం పెరుగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ తెలుగు సినీ ప్రియులకు దగ్గరైపోతున్నారు.