
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అధికారికంగా మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది.
ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో అల్లర్లు, అల్ల కల్లోలాల నేపథ్యంలో చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సెట్స్ లోకి రాకపోయినా, ఆయన లేని కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ పరంగా ఈ సినిమా కొత్త రేంజ్ చూపించనుంది. విడుదలైన అధికారిక స్టిల్‌లో పోలీసులు ఒక భారీ అల్లరి సంఘటనను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు పెంచేసింది.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసేశారని సమాచారం. “మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమా ఉంటుంద”న్న నమ్మకంతో టీమ్ ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ War 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే ఆయన ఈ మూవీ సెట్స్‌లో చేరనున్నారు.
ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.