
సినిమా ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయమైన సమస్యల్లో casting couch కూడా ఒకటి. గతంలో చాలా మంది హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు అదే విషయంపై తాజాగా హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ సమస్యపై దృష్టిని తీసుకువచ్చాయి. ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొన్ని అవకాశాల కోసం కొంతమంది నుండి “commitments” అడుగుతారని, ఇది ఎంతవరకు దారుణమైనదో వివరించింది.
ఎస్తేర్ మాట్లాడుతూ… “నేను కూడా ఇంకెవరిలాగే ఈ shortcut తీసుకుని ఉంటే బహుశా పెద్ద హీరోయిన్ అయ్యేవాడినేమో. కానీ నాకు అటువంటి shortcutలు ఇష్టం లేదు” అని చెప్పింది. ఆమె షాకింగ్‌గా చెప్పింది – “ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లాలన్నా కూడా commitment అడుగుతున్నారు. అటువంటి వాతావరణం వల్లనే నేను అవి దూరంగా ఉంటున్నాను” అని వెల్లడించింది.
తెలుగులో ‘వేయి అబద్ధాలు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఎస్తేర్, తరువాత సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో నటించింది. బబ్లీ గా కనిపించే ఈ బ్యూటీ నటనతో పాటు అందంతోనూ మెప్పించింది. కానీ సరైన అవకాశాలు రాకపోవడంతో కెరీర్ నిలకడగా కొనసాగలేకపోయింది.
ఆమె సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని, తర్వాత విడిపోయింది. ప్రస్తుతం మీడియా ముందు చాలా ధైర్యంగా ఆమె ఇలాంటి నిజాలు బయటపెడుతోంది. ఆమె వ్యాఖ్యలు పరిశ్రమలో జరుగుతున్న దుర్మార్గాలను బయటపెడుతున్నాయి. కొత్తగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న నటీమణులకి ఇది హెచ్చరికగా నిలుస్తుంది.