
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ మాత్రమే కాకుండా అదృష్టం కూడా ఎంతో కీలకం. ఎంతో మంది మంచి నటన ఉన్నా సరైన అవకాశాలు రాక వెనుకబడిపోయారు. మరికొందరు అనుకోకుండా తాము చేసిన పొరపాట్లు లేదా ఎదుటివారి కారణంగా కెరీర్‌ను కోల్పోయారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి సంఘటనలోనే ఓటి శ్వేతా బసు ప్రసాద్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు, తొలి సినిమాతోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అనుకోని కారణాలతో ఆమె కెరీర్ క్షణాల్లోనే మారిపోయింది. వ్యభిచారం కేసులో చిక్కుకుంది అనే ఆరోపణలు ఆమె జీవితాన్ని తలకిందులు చేసాయి. ఈ కేసు గురించి ఆమె ఎంతగా వివరణ ఇచ్చినా, ఆమె సినీ కెరీర్ తిరిగి పుంజుకోలేకపోయింది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్‌లో బాడీ షేమింగ్‌కు గురయ్యానని చెప్పింది. ఓ హీరో తన హైట్ గురించి రోజూ కామెంట్స్ చేస్తూ వేధించాడని తెలిపింది. “నాను 5.2, అతను 6 అడుగులు. నా హైట్ నా చేతిలో లేదు. కానీ అతను నన్ను రోజూ కామెంట్ చేసేవాడు. ఇది నాకు మానసికంగా కష్టంగా మారింది” అని చెప్పింది.
ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన కెరీర్‌ను కొత్తగా మలుచుకుంటోంది. ఇండస్ట్రీలో ఎదురైన కష్టాలను దాటి మళ్లీ తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారనుంది.