
టాలీవుడ్ అందాల తార సమంత ప్రస్తుతం సాకీ బ్రాండ్ దుస్తుల వ్యాపారం, ఏకం లెర్నింగ్ స్కూల్ ద్వారా బిజీగా ఉంది. సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం ఇతర హీరో, హీరోయిన్లకు గిఫ్ట్‌గా పంపడం సాధారణమే. తాజాగా సమంత తన సాకీ బ్రాండ్ దుస్తులను రష్మిక మందన్నకు పంపించింది.
ఇదే విషయాన్ని నేషనల్ క్రష్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, సమంతకు థ్యాంక్స్ చెప్పింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్లు వ్యక్తం చేస్తున్నారు. సమంత కొత్త తరహా బ్రాండ్ ప్రమోషన్ చేసినట్లు ఫాన్స్ భావిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే, రష్మిక అత్యంత విజయవంతమైన “ఛావా” చిత్రంతో బిగ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె “కుబేర” అనే సినిమాలో నటిస్తోంది, ఇది జూన్ లో విడుదల కానుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో “సికిందర్” అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. దీతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటిస్తోంది.
ఇక సమంత విషయానికి వస్తే, ఆమె తన సాకీ బ్రాండ్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. సినిమాల నుంచి బ్రాండ్ ప్రమోషన్ వరకు సమంత తన మార్కెటింగ్ టాలెంట్ చూపిస్తూనే ఉంది. రష్మిక-సమంతల మధ్య ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఎక్సేంజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.