
మాస్టర్ చెఫ్‌గా ప్రసిద్ధి చెందిన సంజయ్ తుమ్మా తాజాగా చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వంటలతో పాటు వినోదాన్ని కలిపే రీల్‌లు చేస్తూ ఉంటే.. ఈసారి చేసిన వీడియో మాత్రం వివాదానికి దారి తీసింది. అలేఖ్య చిట్టి, రమ్య వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురికి అభ్యంతరంగా మారాయి.
“డ్యాష్ చూపించి చికెన్ పికిల్స్ అమ్ముతున్నారు” అంటూ సంజయ్ చేసిన కామెంట్ అంతవరకు సరదాగా అనిపించినా… వెంటనే వల్గర్‌గా మారిపోయిందని నెటిజన్లు అంటున్నారు. “చికెన్ బ్రెస్ట్‌లో ఫ్యాట్ ఉండదు.. అందుకే బ్రెస్ట్ వాడితే సెల్ఫ్ లైఫ్ ఎక్కువ” అని చెప్పిన సంజయ్.. చివర్లో “నాన్‌వెజ్ పికిల్స్ మీరే చేసుకోండి.. బూతులు తినకండి” అంటూ ముగించాడు. దీనిపై పలువురు సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతను మాస్టర్ చెఫ్ అనే పేరుతో ఫేమ్ గెయిన్ చేసినప్పటికీ, ఇలాంటి కామెంట్లు చేయడం ఏకంగా ఆ ఫేమ్‌కే డ్యామేజ్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి మహిళలపై అర్ధంలేని కామెంట్లు చేయడమేంటని ఫిమేల్ ఫాలోవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి సంజయ్ తుమ్మ దీనిపై వివరణ ఇస్తాడా? లేక మళ్లీ అలాంటి రీల్‌లు చేయడం మానేస్తాడా? చూడాలి మరి!