
ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఈ చిట్టి ఆడియో వల్ల నటి అలేఖ్య తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యింది. ఆమె నోటినుంచి వచ్చిన బూతు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అలేఖ్యతో పాటు ఆమె అక్కాచెల్లెల్లను కూడా నెటిజన్లు టార్గెట్ చేయడం ప్రారంభించారు. అంతేకాదు, వారిని యూట్యూబ్ కంటెంట్ కోసం చాలామంది దారుణంగా వినియోగించారు.
ఈ వ్యవహారం అంతటితో ఆగలేదు. అలేఖ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలోని ICUలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె చేసిన తప్పు కావాలని చేయలేదని అలేఖ్య అక్క, చెల్లె క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ట్రోలింగ్ తగ్గలేదు. సోషల్ మీడియా విమర్శలు, బిజినెస్ నష్టాలు కలిసి అలేఖ్యను మానసికంగా ప్రభావితం చేశాయి.
క ooitె వృత్తిగా నిర్వహించిన పచ్చళ్ల బిజినెస్ కూడా ఈ వివాదం కారణంగా నష్టాల్లోకి వెళ్లింది. YouTube Views కోసం చాలామంది అలేఖ్య, రమ్య వంటి పేర్లపై దాడికి దిగారు. వీడియోలు చేయడం, thumbnails లో తప్పుడు ఆరోపణలతో ప్రజల దృష్టిని ఆకర్షించడం ఎక్కువైపోయింది.
ఈ పరిస్థితుల మధ్య అలేఖ్య తీవ్రంగా బాధపడుతూ డిప్రషన్ లోకి వెళ్లింది. చివరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం అలేఖ్య ఆరోగ్య స్థితి మెరుగవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియా బాధ్యతలపై కొత్తగా ఆలోచించేలా చేస్తోంది.