
ఇమాన్వి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, కంటెంట్ క్రియేటర్‌గానే కాకుండా, సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించి ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నిలిచింది. అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ నుండి MBAలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె, చిన్ననాటి నుంచి డ్యాన్స్ పట్ల గొప్ప ఆసక్తిని కలిగి ఉంది.
తాజాగా, ఇమాన్ ఇస్మాయిల్, సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ” (Fauji) సినిమాలో కథానాయికగా ఎంపికైంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా (periodic action drama) సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలి సినిమాలోనే ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం, ఆమెకు గొప్ప బ్రేక్ ఇవ్వనుంది.
ఇమాన్ ఇస్మాయిల్ చిన్నతనం నుంచే డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధించిందని, వివిధ రకాల డ్యాన్స్ స్టైల్స్‌లో ప్రాక్టీస్ చేసిందని ఆమె సోషల్ మీడియా పోస్టులు చెబుతున్నాయి. డ్యాన్స్‌తో పాటు మోడలింగ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, పలు బ్రాండ్‌లకు మోడల్‌గా కూడా పనిచేసింది. ఈ విషయాలన్నీ ఆమెను ఒక మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీగా నిలిపాయి.
“ఫౌజీ” సినిమా షూటింగ్ మొదలవుతుండగా, ఇమాన్ ఇస్మాయిల్ గ్లామరస్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే ఆమెకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.