పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎదురీదుతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, హిందీ మూవీ ‘ధురంధర్ ది రివెంజ్’తో పోటీ పడింది. లాంగ్ వీకెండ్ సెలవులు కలిసి వచ్చినప్పటికీ, సినిమాకు లభించిన యావరేజ్ టాక్ కారణంగా సోమవారం నుండి వసూళ్లలో తగ్గుదల కనిపిస్తుంది.
ప్రారంభంలో ఈ సినిమా మల్టిప్లెక్స్‌లు మరియు బీసీ సెంటర్‌లలో మంచి సందడి చేసినప్పటికీ, ఆ జోరు ఎక్కువ రోజులు నిలవలేదు. ముఖ్యంగా సోమవారం నుంచి మల్టిప్లెక్స్‌లలో ప్రేక్షకుల ఆదరణ కరువైంది. ప్రస్తుతం ఈ చిత్రం కేవలం బీసీ సెంటర్స్‌లో మాత్రమే కాస్త ప్రభావం చూపుతోంది. అర్బన్ ఆడియన్స్ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడం కలెక్షన్లపై దెబ్బ కొడుతుంది. కానీ, మాస్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం కొంతమేర ఊరటనిచ్చే విషయం.
వీకెండ్ ముగియగానే థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మాస్ ఆడియన్స్ మినహా, సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడటం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
The put up ఉస్తాద్ భగత్ సింగ్ : మాస్ మాత్రమే నెట్టుకొస్తున్న వైనం..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
