రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా అరంగేట్రం చేస్తూ శివాని నాగారం హీరోయిన్ గా రిలీజ్ చేసుకున్న చిత్రం లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. యూత్, ఫ్యామిలీస్ లో మంచి హిట్ అయ్యి సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా మేకర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు అందించిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో లిటిల్ హార్ట్స్ చిత్రం నేటి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఉన్న కంటెంట్ కంటే మరికొన్ని కామెడీ సీన్స్ తో ఈసారి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ నిర్మాణం వహించారు. అలాగే ఈటీవీ విన్, బన్నీ వాస్ సమర్పణలో ఈ చిత్రం విడుదలకి వచ్చింది.
The put up ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “లిటిల్ హార్ట్స్” first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.