
తాజాగా ఓటీటీలో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సినిమా ‘చురులి’. మలయాళ ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్త కథలతో ఆకట్టుకునే చిత్రాలు వస్తుంటాయి. తాజాగా లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
చురులి కథ ఏంటి?
ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్. నేరస్తుడిని పట్టుకునేందుకు ఇద్దరు పోలీసులు అండర్ కవర్ గా ఓ అడవిలోకి వెళ్తారు. అక్కడ ‘చురులి’ అనే వింత గ్రామం ఉంటుంది. అయితే అక్కడి గ్రామస్థులు చాలా రహస్యంగా ప్రవర్తిస్తుంటారు. ఆ గ్రామం ఎందుకు అలా ఉంది? పోలీసులకు ఎలాంటి కొత్త సంఘటనలు ఎదురయ్యాయి? చివరకు వాళ్లు అసలు నేరస్తుడిని పట్టుకున్నారు లేదా? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
చురులి స్పెషల్ ఎలిమెంట్స్
సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ముఖ్యంగా సినిమా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మిస్టరీ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమాలో చెంబన్ వినోద్ జోస్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, వినయ్ ఫోర్ట్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇప్పటికే మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. మీరు థ్రిల్లర్ సినిమాల అభిమానులైతే ‘చురులి’ ని ఓటీటీలో తప్పక చూడండి.