Mon. Oct 13th, 2025

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే “మదరాసి”. మంచి బజ్ నడుమ వచ్చిన ఈ సినిమా తమిళ్ లో డీసెంట్ గానే రన్ అయ్యింది. ఇక తెలుగులో కూడా విడుదల అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ పవర్ఫుల్ విలన్ గా నటించారు. అలాగే శ్రీ లక్ష్మీ మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మదరాసి” first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.