Mon. Oct 13th, 2025

డివోషనల్ కంటెంట్‌తో కూడిన స్పెషల్ కథనం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ మూవీ తర్వాత, రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌గా ‘కాంతార : ఛాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల్లోనూ దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోలు తమ మద్దతు ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించి డివోషనల్ అంశాలతో తీర్చిదిద్దిన రిషబ్ శెట్టి ని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరై మరింత హైప్‌ను పెంచారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యాక్షన్ డ్రామాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం, సరిహద్దులను దాటి మనుషులను కలిపే కళను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇలా టాలీవుడ్‌లోని అగ్ర తారల మద్దతుతో, సంప్రదాయ-సంస్కృతుల ఆధారంగా రూపొందిన ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

The submit ‘కాంతార చాప్టర్ 1’ టాలీవుడ్ టాప్ స్టార్స్ అండదండలు..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.