
జివి ప్రకాష్ హీరోగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమా థ్రిల్లింగ్ హర్రర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా అంచనాలను అందుకుందా?
కథ: కింగ్‌స్టన్ అలియాస్ జివి ప్రకాష్ సముద్రపు స్మగ్లింగ్ గ్యాంగులో పని చేసే కుర్రాడు. తన స్వంత బోటు కొనాలనేది అతని కల. కానీ స్మగ్లర్ గ్యాంగ్ లీడర్ థామస్‌తో గొడవ పెట్టుకోవడంతో, ఊరు మొత్తం శాపానికి గురవుతుంది. సముద్రంలోకి వెళ్లినవారు చనిపోతారు అన్న భయంతో అక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తారు. ఈ శాపం వెనుక రహస్యం ఏంటి? కింగ్ తన మిత్రులతో కలిసి ఈ మిస్టరీను ఛేదించగలిగాడా?
రివ్యూ: సినిమా కథ బాగానే ఉంది, కానీ ఎమోషనల్ కనెక్షన్ లోపించింది. లాజిక్స్ పక్కన పెడితే కూడా, కథలో మేజర్ మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయ్. హీరోయిజం ఎలివేషన్లు, మాస్ ఎంట్రీలు పెట్టినప్పటికీ, సినిమా అంతా ఒక తమిళ డబ్బింగ్ ఫీల్ ఇస్తుంది.
సెకండ్ హాఫ్‌లో అడ్వెంచర్ బాగుంటుందని అనిపించినా, కొన్ని సీన్లు నిరాశ కలిగిస్తాయి. సముద్రంలోని వింత జీవులు, శాపం వెనుక మిస్టరీ ఆసక్తికరంగా కనిపించినా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉన్నప్పటికీ, సినిమా ఆడియెన్స్‌ను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది.
మొత్తంగా, కింగ్‌స్టన్ ఓ మిస్టరీ హర్రర్ అయినా, ఎమోషనల్ కనెక్ట్ లేక, అసంతృప్తిని మిగిల్చింది. హర్రర్, సముద్రం, అడ్వెంచర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.