
ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ‘వార్ 2’ (War 2) టీజర్ మే 20న విడుదలై టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (Jr NTR) కలిసి తొలిసారిగా స్క్రీన్ పంచుకోవడంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీజర్‌ను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Ram Gopal Varma Trolls Kiara Advani Bikini Look
టీజర్‌లో కియారా అద్వానీ (Kiara Advani) లుక్ హైలైట్‌గా నిలవడంతో, ఆమె బికినీ (Bikini) సీన్ చర్చనీయాంశంగా మారింది. కొన్ని సెకన్లే కనిపించినా కియారా గ్లామర్ లుక్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా కియారా మరోసారి తన గ్లామర్ గేమ్‌ను చూపించింది.
అయితే ఈ బికినీ లుక్‌ను వాడుకుంటూ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ఫోటో షేర్ చేసి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. హృతిక్, ఎన్టీఆర్‌లను కియారాతో లింక్ చేస్తూ అర్థంలేని క్యాప్షన్లు రాశాడు.
వర్మ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇది మీ స్థాయికి తగినదేనా?” అంటూ ట్రోల్స్ షురూ అయ్యాయి. వర్మ ఆ పోస్ట్‌ను తొలగించినా, స్క్రీన్ షాట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వివాదం ఇంకాస్త కాల్పులే చెబుతోంది.