హర్యానా సుందరిగా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి కేవలం కొద్దికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. డెంటిస్ట్‌గా కెరీర్ చేయాలనుకున్న ఈ ముద్దుగుమ్మ, అనుకోకుండా అందాల ప్రపంచంలోకి అడుగుపెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌గా కూడా నిలిచింది.
అందాల ప్రపంచంలో రాణించిన తర్వాత సినిమాల్లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకవైపు డెంటిస్ట్‌గా, మరోవైపు మోడల్‌గా, ఇంకోవైపు సినీ నటిగా ఇంత చిన్న వయసులోనే ఎన్నో రంగాల్లో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగులో అనేక సినిమాల్లో నటిస్తూ వస్తున్న మీనాక్షి చౌదరి త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం ఖాయం.