
సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ, అతని సినీ ప్రయాణం అసాధారణంగా ఆసక్తికరమైనది. కెరీర్ ప్రారంభంలో అనేక అవమానాలు, విపత్తులు, విమర్శలు ఎదుర్కొన్న సైఫ్, బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
1992లో “బేఖుడి” సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్నా, దర్శకుడు రాహుల్ అతన్ని తొలగించారు. ఆ తరువాత 1993లో “పరంపర” సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. అయితే 1994-1998 మధ్య “యార్ గద్దర్”, “సురక్ష”, “ఏక్ థా రాజా” వంటి వరుస 10 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
కానీ 1999లో “హమ్ సాథ్ సాథ్ హై” ద్వారా అతనికి తొలి విజయం లభించింది. ఆ తరువాత “కల హో నా హో”, “తనా జీ”, “సర్దార్ ఖాన్” వంటి బ్లాక్బస్టర్లతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, సైఫ్ మొత్తం ఆస్తులు ₹1200 కోట్లు.
తాజాగా, “దేవర” సినిమాతో టాలీవుడ్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సైఫ్, తన పవర్ఫుల్ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీకి మారుతున్న సైఫ్, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు సమాచారం.