
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటనతో “ఛావా” సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.121 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో విక్కీ కౌశల్ ఛావా సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో అన్న చర్చ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా విక్కీ ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్లు వరకు రెమ్యునరేషన్ అందుకుంటాడట. అయితే, ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ ఈ సినిమాలో రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.
విక్కీ కౌశల్ తన అద్భుతమైన నటనతో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత, ఆయన కెరీర్ మరింత హైప్ సాధించింది. ఇప్పుడు అభిమానులు విక్కీ కౌశల్ పర్సనల్ లైఫ్, కొత్త సినిమాలు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
“ఛావా” సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత, విక్కీ కౌశల్ రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందా? ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తాడో? అనేది చూడాలి.