
“ఛావా” సినిమా భారతీయ సినీ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తోంది. సినిమా లవర్స్ అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు – “ఛావా చూశావా?” ఈ చిత్రం శక్తివంతమైన కథ, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్ కలిగి, థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. శంభాజీ మహారాజ్ జీవిత గాథను ఈ విధంగా తెరపై చూపించగలిగారు అంటే, శివాజీ మహారాజ్ కథను ఇంకా గొప్పగా తీర్చిదిద్దితే బాక్సాఫీస్‌ను షేక్ చేయకుండా ఉండదు.
విక్కీ కౌశల్ తన పాత్ర కోసం ఎనిమిది గంటల పాటు శిక్షణ తీసుకున్నాడని చెప్పినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు గాయాలు వచ్చినా పట్టించుకోకుండా, కేవలం నటన మీద దృష్టి పెట్టారు. అదే విధంగా, రష్మిక మందన్నా కూడా తన కాలి గాయాన్ని పట్టించుకోకుండా మూవీ ప్రమోషన్లో పాల్గొంది. ఈ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సినిమాలో శంభాజీ మహారాజ్ ధైర్యం, త్యాగం, నమ్మిన ధర్మాన్ని కాపాడటానికి చేసిన పోరాటాలు అద్భుతంగా చూపించారు. ప్రతి సన్నివేశం భావోద్వేగాన్ని మిగిల్చేలా రూపొందించారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ “ఛత్రపతి శివాజీ మహారాజ్” బయోపిక్ ఎప్పుడు వస్తుందా?” అని ఎదురుచూస్తున్నారు.
“కాంతార” ఫేమ్ రిషబ్ శెట్టి, శివాజీ మహారాజ్ పాత్రలో నటించనున్నట్లు టాక్. ఆయన సినిమా పూర్తయిన వెంటనే శివాజీ మూవీ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మూవీ లవర్స్ కోసం ఇది సూపర్ న్యూస్!