Mon. Oct 13th, 2025

యస్.యస్. మూవీ కార్పొరేషన్ బ్యానర్‌లో బిపేట ప్రేమ్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ‘వాషింగ్టన్ సుందర్’ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్య వినుగొండ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్య వినుగొండ, అను శ్రీ, శీతల్ భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నందన్ రాజ్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇటీవలే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య వినుగొండ మాట్లాడుతూ, “చిన్నప్పటి నుంచి తన ఊరును వదిలి వెళ్లిపోయిన ఒక యువకుడు 15 సంవత్సరాల తర్వాత ఆ ఊరికి ఎందుకు వచ్చాడో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో, మళ్లీ ఎందుకు హైదరాబాద్‌కు వెళ్లిపోయాడో ఈ కథ ‘వాషింగ్టన్ సుందర్’. ఈ సినిమాలో సంగీతం ప్రధాన హైలైట్. నందన్ రాజ్ బొబ్బిలి అందించిన సంగీతం చాలా బాగుంది. నిర్మాణ పనులు పూర్తయ్యి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు.

ఈ చిత్రానికి డీఓపీగా మధు బసిరెడ్డి, శ్రీనివాస్ విన్నకోట, ఎడిటర్‌గా మేనగ శ్రీను, కోరియోగ్రఫీకి గణేష్ మాస్టర్, ఫైట్స్‌కు నందూ, డిజిటల్ ఇంప్రూవ్‌మెంట్‌కు యమ్ బి ప్రకాష్, 5.1 సౌండ్ కోసం కాళీఎస్.ఆర్ అశోక్, సహ నిర్మాతలుగా అంజయ్య దన్నారం, జీవన్ రెడ్డి పోతులూరి, అనిల్ కుమార్ గుజ్జరి వ్యవహరిస్తున్నారు.

The publish డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘వాషింగ్టన్ సుందర్’ చిత్రం తొలి పాట విడుదల first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.