బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ సినిమానే ధురంధర్ 2. ఎన్నో అంచనాలు నడుమ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్లకి చేరువలో ఉంది. ఇక ఈ సినిమాకి మన తెలుగు స్టేట్స్ లో కూడా గట్టి ఓపెనింగ్స్ మొదటి వారాంతానికి వచ్చేసాయి. అయితే ఇప్పుడు సినిమా కొంచెం స్లో అయినట్లు తెలుస్తోంది.
మెయిన్ గా ఏపీలో ధురంధర్ 2కి ఆశించిన రేంజ్ లో బుకింగ్స్ కూడా పడడడం లేదు. మొదటి వారాంతం ట్రెండింగ్ తో పోలిస్తే వీక్ డేస్ లో కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ మళ్లీ రామ నవమి అలాగే వీకెండ్ లలో డెఫినెట్ గా పుంజుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మళ్లీ ధురంధర్ 2 క్యాష్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.
The publish తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్లో అయ్యిన ‘ధురంధర్ 2’? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
