
సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్ కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనే తేడా లేకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్‌ను మళ్లీ బిల్డ్ చేసుకుంటోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్, ఒక తెలుగు హీరో గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఓ సినిమా సమయంలో ఒక తెలుగు హీరో తన హైట్ గురించి పదే పదే ఎగతాళి చేసేవాడని చెప్పింది. ఆ హీరో హైట్ 6 అడుగులు ఉండగా, తాను 5.2 అడుగుల మాత్రమే ఉండడం వల్ల యూనిట్ మొత్తం తనను ఫన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, ఆ హీరో తెలుగువాడే అయినా సరైన తెలుగు మాట్లాడలేడని ఆమె వ్యాఖ్యానించింది. కానీ, తన భాష గురించి పట్టించుకోకుండా, తన హైట్ గురించి మాత్రం కామెంట్ చేయడం బాధించిందని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ హీరో ఎవరా? అంటూ గెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
శ్వేతా బసు ప్రసాద్ నటించిన సినిమాల జాబితా పరిశీలిస్తూ ఆ హీరో ఎవరు? అనే డిస్కషన్ నెట్టింట రసవత్తరంగా మారింది. మరి ఆ హీరో ఎవరో బయటపడుతుందా? లేదా అనేది చూడాలి!