నేచురల్ స్టార్ నాని తన సినిమాలను చాలా వేగంగా పూర్తి చేసి, వెంటనే తర్వాతి ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడుతుంటాడు. అయితే, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం నాని ఒక సవాల్‌తో కూడిన పాత్రను పోషిస్తున్నాడు. భారీ సెట్లు, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.
షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నాని దాదాపు రెండు నెలల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ప్రారంభంలో ఈ జాప్యం పట్ల ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ సాంగ్ భారీ హిట్ కావడంతో ఇప్పుడు నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ పాట తెచ్చిపెట్టిన క్రేజ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ పాజిటివ్ వైబ్‌తో నాని ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
ఈ మాస్ ఎంటర్టైనర్లో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, తన తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని నాని భావిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ది ప్యారడైజ్’ ఈ ఏడాది ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
The put up ‘ది ప్యారడైజ్’ కోసం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్న నాని..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
