పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న సాలిడ్ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ చిత్రం “ది రాజా సాబ్”. అంతకంతకు మంచి హైప్ ని పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రీసెంట్ గానే సాంగ్స్ తాలూకా షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు.
ఇక లేటెస్ట్ గా గ్రీస్ లో జరుగుతున్న షూటింగ్ సెట్స్ నుంచి మారుతీ స్ట్రైట్ అప్డేట్ అందించారు. అయితే ఇందులో సర్ప్రైజింగ్ గా ప్రభాస్ బొమ్మ కనిపిస్తున్న రాజా సాబ్ టి షర్ట్ లో దర్శనమివ్వడం ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చింది. దీనితో ఈ పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
The put up ‘ది రాజా సాబ్ సెట్స్’ నుంచి మారుతీ సర్ప్రైజ్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.