
పైన ఫోటోలో ఉన్న బాలనటిని గుర్తుపట్టారా? ఒకప్పుడు తెలుగు, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్, ఇప్పుడు గ్లామరస్ లుక్‌లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఆమె మరెవరో కాదు… ఎస్తర్ అనిల్!
చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు..
ఎస్తర్ అనిల్ 2013లో మలయాళ సూపర్ హిట్ దృశ్యం సినిమాలో మోహన్‌లాల్ చిన్న కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అదే సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్, మీనాల మధ్య నటించిన వెర్షన్‌లోనూ ఆమె మెరిసింది. దృశ్యం (2014) సినిమా తర్వాత ప్రేక్షకుల్లో ఆమెకో ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
ఇప్పుడేం చేస్తోంది ఎస్తర్ అనిల్?
ప్రస్తుతం ఎస్తర్ అనిల్ హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ స్టైలిష్ ఫోటోషూట్లతో తన హవా చూపిస్తోంది. ఆమె పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి గ్లామర్ డివాగా మారిన ఈ అమ్మడు లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
కుర్రకారు ఫేవరెట్
ఇప్పట్లోనే తన స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఎస్తర్, త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.