Thu. Mar 26th, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ ట్రీట్‌గా రిలీజ్ చేస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర కానుంది. వేసవి సెలవులను క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఈ డేట్‌ను లాక్ చేసింది. అయితే, యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్ టికెట్ ధరలు $25 – $35 గా ఉండటంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా, టెక్నికల్‌గా రిచ్‌గా ఉన్న ‘ధురందర్ 2’ వంటి సినిమాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో.. ఒక పల్లెటూరి నేపథ్య కథకు ఇంత రేటు అవసరమా అని ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. భారీ కొనుగోలు ధరల కారణంగానే డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటే ఈ ధరల ప్రభావం ఉండదు కానీ, ఏ మాత్రం టాక్ అటు ఇటు అయినా ఈ రేట్లు సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఇక ఈ వారం నుండే యూఎస్ బుకింగ్స్ మొదలుకానుండటంతో ఓవర్సీస్‌లో పెద్ది చేయబోయే రచ్చ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

The put up ధురంధర్ 2 ఎఫెక్ట్ : అక్కడ ‘పెద్ది’కి సమస్యగా మారనుందా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.