రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలో ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.690 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ నుండే రూ. 650 కోట్లు రాగా, ఇతర భాషల ద్వారా మరో రూ. 40 కోట్లు వసూలయ్యాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సంచలనం రేపుతోంది. గల్ఫ్ దేశాల్లో విడుదల కాకపోయినప్పటికీ, విదేశాల్లో రూ.274 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నేటి వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1100 కోట్ల మార్కును దాటేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
The put up ‘ధురంధర్ 2’ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
