యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ దేసిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న థియేటర్లలోకి రానుంది. త్వరలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది.
ఈ సినిమాలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
The submit నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రిలీజ్ డేట్ లాక్.. వచ్చేది ఎప్పుడంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
