టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి తాజాగా తన హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. గోల్డెన్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో ఇచ్చిన స్టన్నింగ్ పోజులు చూసి అభిమానులు శాక్ అవుతున్నారు. ఆమె పోస్టులకు వైరల్ కామెంట్లు వస్తున్నాయి. గ్లామర్, స్టైల్ తో నేహా తన ఫ్యాన్స్‌ను ఓవర్‌లోడ్ చేస్తూ, సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటోంది.
సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నేహా, ఈ సినిమా తర్వాత యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మోడ్రన్ లుక్స్, బోల్డ్ కేరెక్టర్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన నేహా, టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. కాకపోతే, ఇటీవల ఆమె టాలీవుడ్ లో తక్కువగా కనిపించడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది.
తెలుగులో ఒకటిరెండు సినిమాలు చేసినా, ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం హైలైట్ అవుతోంది. తన గ్లామరస్ ఫోటోషూట్స్, స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతూ, అభిమానులను అదిరిపోయేలా ఆకట్టుకుంటున్నాయి. మరి నేహా శెట్టి టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తుందా? లేదంటే కన్నడ సినిమాలకే పరిమితం అవుతుందా? అన్నది చూడాలి!