టాలీవుడ్ సహా దక్షిణాదిన అన్ని ప్రధాన భాషల్లో నటించినా రెజీనా కసాండ్రా కెరీర్‌లో మేజర్ బ్రేక్ ఇప్పటికీ దక్కలేదనేది సత్యం. 2005లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలతో పనిచేసిన ఆమెకు, లీడ్ రోల్స్ లో నిలిచిపోయే అవకాశాలు మాత్రం తక్కువే దక్కాయి.
ఇటీవల గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే రెజీనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఆమె టాలెంట్‌ను నిరూపించుకుంటోంది. అంతేకాకుండా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనూ కొత్త ప్రయోగాలు చేస్తోంది. నటనకు సంబంధించి రెజీనాకు ఎలాంటి పరిమితులు లేవు. కానీ సరైన కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.
ఇదిలా ఉండగా, రెజీనా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్. ఇటీవలి కాలంలో ఆమె పూల చీరకట్టులో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌లో ఆమె ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. అభిమానులు “ఇది చూసాకా ఇంకా సినిమాల్లో బ్రేక్ రాదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకనైనా టాలీవుడ్ రెజీనా టాలెంట్‌ను గమనించి ఆమెకు ఒక పవర్‌ఫుల్ రోల్ ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.