కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై యతీంద్ర, రమ్య దినేష్ జంటగా రూపొందుతున్న సరికొత్త చిత్రం “పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ”. ఏ. ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు విడుదల చేశారు. కామెడీ డ్రామా మరియు థ్రిల్లర్ అంశాల కలయికతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.
ఒక్క రాత్రిలో, ఒక హాస్పిటల్ నేపథ్యంలో జరిగే ఉత్కంఠభరిత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో యతీంద్ర విభిన్నమైన బ్రాహ్మణ గెటప్‌లో కనిపిస్తుండటం విశేషం. కథలో ఉండే మలుపులు, హాస్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమలాపురం మరియు దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేశారు. విలక్షణమైన టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.
The publish “పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ” మోషన్ పోస్టర్ విడుదల first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
