
“హనుమాన్” విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ “జై హనుమాన్” ప్రకటించాడు. పోస్టర్ కూడా విడుదల చేశాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ప్రభాస్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. “బ్రహ్మ రాక్షస్” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఇప్పటికే ప్రభాస్ కి స్క్రిప్ట్ చెప్పి అంగీకారం పొందాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో “జై హనుమాన్” షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు మోక్షజ్ఞ నటించబోయే సినిమా కూడా హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని పూర్తి చేసే దశలో ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజి”, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటికి బ్రేక్ ఇచ్చే సమయంలో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై పనిచేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.
అదే సమయంలో రిషబ్ శెట్టి “కాంతార 2” పూర్తిచేసిన తర్వాత 2027లో “ఛత్రపతి శివాజీ” ప్రాజెక్ట్ చేయనున్నాడు. దీంతో “జై హనుమాన్” మూవీ 2028కి వెళ్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.