వెర్సటైల్ నటుడు తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ‘ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ చుట్టూ తిరిగే ప్రేమకథ, దానిలో వచ్చే ఆసక్తికరమైన సమస్యలు, వాటి ద్వారా పుట్టే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘వయ్యారి వయ్యారి’ లవ్ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సనారే రాసిన సాహిత్యం సింపుల్‌గా, ఆకట్టుకునేలా ఉండగా, యశ్వంత్ నాగ్-సింధూజ శ్రీనివాసన్ గాత్రం పాటకు అందాన్ని తెచ్చింది. సురేష్ బొబ్బిలి స్వరపరచిన ఈ మెలోడి హృదయానికి హత్తుకునేలా ఉంది. లిరికల్ వీడియోలో హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ, సినిమా లవ్ ట్రాక్‌ను హైలైట్ చేస్తోంది.
ఈ చిత్రానికి కెమెరామెన్‌గా కె.సోమ శేఖర్, ఎడిటర్‌గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రజ్ఞయ్ కొణిగారి పనిచేశారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
The put up ‘ప్రీ వెడ్డింగ్ షో’లో మెస్మరైజ్ చేస్తున్న ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ సాంగ్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.