సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కయాడు లోహర్ పేరే వినిపిస్తోంది. డ్రాగన్ మూవీ సక్సెస్ కయాడు కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫంకీ’ మూవీలో ఈ బ్యూటీ లీడ్ రోల్ పోషిస్తోంది.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కయాడు 2022లోనే శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో కయాడు పేరు పెద్దగా వినిపించలేదు. కానీ ఇప్పుడు డ్రాగన్ హిట్ కావడంతో ఆమెకు తెలుగు పరిశ్రమ నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పుడిప్పుడు గుర్తింపు పొందిన కేవలం కయాడు లోహర్ మాత్రమే కాదు. భాగ్యశ్రీ బోర్సే కూడా తన ఫస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, సూర్య-వెంకీ అట్లూరి ప్రాజెక్ట్, రామ్ సినిమా వంటి బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది.

ఇక మీనాక్షి చౌదరి కూడా ఫ్లాప్ మూవీ ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ తో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’, సంక్రాంతి రిలీజ్‌తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. మొత్తానికి, ఫ్లాప్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్లు ఇప్పుడు టాప్ ప్లేస్‌పై కన్నేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *