మన తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. ఇప్పుడు 9వ సీజన్ మంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుండగా ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో మంచి ఇంట్రెస్టింగ్ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు కొనసాగిన ప్రముఖ నటి నువ్వు నాకు నచ్చావ్, మీర్జాపూర్ ఫేమ్ నటి ఫ్లోరా సైని, శ్రీజ ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన ఇద్దరు సర్ప్రైజింగ్ కంటెస్టెంట్స్ కోసం ఆల్రెడీ వీక్షకుల్లో చర్చ మొదలైంది.
ఇలా వైల్డ్ కార్డు ఎంట్రీలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యిన దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారగా ఆమెతో పాటుగా స్టార్ మా హిట్ సీరియల్ గృహలక్ష్మి నటుడు నిఖిల్ నైర్ అలాగే చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ఇంకా బాల నటుడుగా కనిపించిన నటుడు శ్రీనివాస్ సాయి ఇంకా సీరియల్ నటి ఆయేషాలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితో ఈసారి నుంచి మాత్రం డ్రామా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని బిగ్ బాస్ షో ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
The publish బిగ్ బాస్ 9: ఫ్లోరా అవుట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్స్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.