Thu. Mar 26th, 2026

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, బలమైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దుల్కర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తుండగా, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ప్రాజెక్ట్‌కు దుల్కర్ సల్మాన్‌ను ఇప్పటికే లాక్ చేసినట్లు సమాచారం. దర్శకుడు సంపత్ నంది ఇటీవల దుల్కర్‌కు కథను వినిపించగా, ఆయన కథను ప్రశంసిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని దుల్కర్ స్పష్టం చేశారు.

మార్చి 2026లో ఈ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దుల్కర్ సల్మాన్‌కు ఇప్పటికే భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముంది.

The put up మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.