Akhil Akkineni Marriage on March 24th
Akhil Akkineni Marriage on March 24th

అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే నాగ చైతన్య, నటి శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుక తర్వాత, నాగ చైతన్య తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ అయిన “తండేల్” సినిమా అందుకోవడంతో కుటుంబం ఆనందోత్సాహంతో ఉంది. ఇప్పుడు, అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగబోతోందనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే నాగచైతన్య పెళ్లి వేడుకలో అఖిల్ కూడా తన ప్రేయసి జైనాబ్ రవడ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులతో ఈ హ్యాపీ న్యూస్‌ను పంచుకున్నారు. అఖిల్ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి.

తాజా సమాచారం ప్రకారం, అఖిల్-జైనాబ్‌ల వివాహం మార్చి 24న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, పెళ్లి తేదీ ఖరారైందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నాగార్జున ఈ వివాహ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినీ సెలబ్రిటీలతో పాటు, రాజకీయ, క్రికెట్ ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు.

ప్రస్తుతం అఖిల్ సీసీఎల్ (Celebrity Cricket League) లో బిజీగా ఉండగా, త్వరలోనే కొత్త సినిమా ప్రకటించనున్నాడు. పెళ్లి అనంతరం, తన కెరీర్‌కు మరింత ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడట. ఈ వార్తతో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *