Coolie Special Song Actress Revealed
Coolie Special Song Actress Revealed

“వా నువ్ కావాలయ్యా” పాటకు అభిమానులు ఓ మామూలు సాంగ్‌గా చూశారు. కానీ, ఈ పాట రజనీకాంత్ “జైలర్” సినిమాకు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసి, ఓపెనింగ్స్‌లో కీలక పాత్ర పోషించింది. ఒక పాట సినిమా విజయం మీద ఎంత ప్రభావం చూపుతుందో “జైలర్” మరోసారి నిరూపించింది.

ఈ నేపథ్యంలో, రజనీకాంత్ కొత్త సినిమా “కూలీ”లో కూడా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. “జైలర్” తరహాలోనే, ఈ సినిమాలో కూడా ఓ సూపర్‌ మాస్ సాంగ్ ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. లోకేష్ కనగరాజ్ ఎవరినైనా స్పెషల్‌గా తీసుకువస్తారా? లేక శ్రుతిహాసన్‌తోనే పాట చేయిస్తారా? అనే చర్చ ప్రారంభమైంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, శ్రుతిహాసన్ పాత్ర చాలా ప్రత్యేకమైనది, అందుకే ఆమె స్పెషల్ సాంగ్‌లో కనిపించే అవకాశం తక్కువ. ఈసారి పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌లో మెరిసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. “కూలీ”లో పూజా హెగ్డే డాన్స్ చేయబోతుందనే వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌తో వస్తున్న “కూలీ” ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. “జైలర్” తరహాలోనే, ఒక పవర్‌ఫుల్‌ మాస్‌ సాంగ్ ప్లాన్ చేస్తే, సినిమా మీద మరింత క్రేజ్ పెరగడం ఖాయం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *