
నేషనల్ క్రష్ రష్మిక మండన్న మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా కన్నడ ఎమ్మెల్యే రవి గనిగ విమర్శలపాలయ్యారు. బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరుకాలేదనే కారణంగా రష్మికపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు.
రష్మిక కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. పుష్ప సినిమాతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. కానీ, బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ కు గైర్హాజరు కావడం కన్నడ ఇండస్ట్రీని నిరాశపరిచింది. ఎమ్మెల్యే రవి గనిగ ఆమెను పిలిచి పదిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె అంగీకరించలేదని ఆరోపించారు.
“రష్మికకు కెరీర్ ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని ఆమె గౌరవించడం లేదు. ఆమె బెంగుళూరుకు రాలేనని, హైదరాబాద్‌లో ఇంటి ఉంది అని చెప్తుంది. అంతేకాదు, ఆమె మాటల్లో ‘కర్ణాటక ఎక్కడుందో తెలియదు’ అనే అర్థం వస్తోంది” అంటూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కన్నడ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేపాయి.
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు రష్మికకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు ఆమె కన్నడ ఇండస్ట్రీపై గౌరవం చూపాలని అంటున్నారు. ఈ వివాదంపై రష్మిక ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం.