
మలయాళ యాక్షన్ హీరో ఉన్ని ముకుందన్ ఏడు ఏళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వినయ్ గోవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గెట్ సెట్ బేబీ’ అనే రోమాంటిక్ కామెడీ మూవీలో గైనకాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ తో పాటు నిఖిల విమల్, సెంబన్ వినోద్ జోస్, శ్యామ్ మోహన్, సురభి లక్ష్మి, జానీ ఆంటోనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు యాక్షన్, సీరియస్ రోల్స్ లో కనిపించిన ఉన్ని, ఈసారి పూర్తి విభిన్నమైన రోల్ లో కనిపించనున్నాడు.
ఇటీవల మనోరమ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉన్ని ముకుందన్, గత ఏడు సంవత్సరాలుగా రొమాంటిక్ సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. తన సినిమాల్లో ముద్దు సీన్స్ లేకూడదనే నిర్ణయం తీసుకోవడంతో, సరైన రోమాంటిక్ స్క్రిప్ట్ దొరకలేదు. కానీ ‘గెట్ సెట్ బేబీ’ కథ తనను ఈ జానర్లోకి తిరిగి రప్పించిందని తెలిపారు.
కామెడీ, లవ్, ఎమోషన్స్ మిళితమైన ఈ మలయాళ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదం అందించనుంది. త్వరలోనే ట్రైలర్ & రిలీజ్ డేట్ అప్డేట్ రానుంది.