ఈ సెప్టెంబర్ నెలలో మంచి హిట్ అయ్యిన టాలీవుడ్ చిత్రాల్లో యువ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. మంచు మనోజ్ పవర్ఫుల్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారీ ఓపెనింగ్స్ ని సాధించి దూసుకెళ్తుంది.
ఇలా రెండో వారంలో కూడా మంచి రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా మొత్తం 12 రోజులు బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. దీనితో “మిరాయ్” చిత్రం ఈ 12 రోజుల్లో 140.08 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇపుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో మిరాయ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సెట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా శ్రేయ శరన్, జైరాం, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
The post వరల్డ్ వైడ్ ‘మిరాయ్’ 12 రోజుల వసూళ్లు ఎంతంటే! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.
