Tue. Mar 24th, 2026

ఇప్పుడు ప్రపంచ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో చేస్తున్న వారణాసి అనే చెప్పాలి. పూర్తిగా మరో ప్రపంచాన్ని రాజమౌళి బృందం సృష్టించగా దానిని బాహ్య ప్రపంచానికి చూపించడంలో మాత్రం పాటుస్తున్న పద్ధతులు, విధానాలు చూస్తుంటే జక్కన్నకి మరో ఇండియన్ దర్శకుడు సాటి లేరనే చెప్పి తీరాలి.

ఈ సినిమా కాన్సెప్ట్ మోషన్ టీజర్ లాంచ్ నుంచి అంతర్జాతీయ మీడియాలలో వారణాసి పేరు నెల నెలన్నరికి ఒక్కసారి అయినా మొగుతూనే ఉంది. ఇలా పలు పాపులర్ మీడియాలతో వారణాసి ప్రమోషన్స్ ఊహాతీతంగా సాగుతున్నాయి. ఇలా లేటెస్ట్ గా మరో సారి వారణాసి హాట్ టాపిక్ అయ్యింది.

గత ఏడాది వారణాసి భారీ సెట్స్ కి సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు ఇంటర్నేషనల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీనితో ఈ సినిమా కోసం మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. సో ఇలా మొత్తానికి ఈ సినిమా వచ్చే వరకు ఆడియెన్స్ మాట్లాడుకునేలా జక్కన్న ఓ పక్కా ప్రణాళిక రూపొందించారు.

The put up ‘వారణాసి’ వరల్డ్: ఒక పద్ధతి.. ఒక విధానం.. జక్కన్న రూటే వేరు first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.