
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న “కింగ్‌డమ్” మూవీతో ఫుల్ మాస్ అవతారంలో రాబోతున్నాడు. “ఖుషి”, “ఫ్యామిలీ స్టార్” సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, అభిమానులు ఈసారి విజయ్ నుంచి పెద్ద సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే లక్ష్యంతో తెరకెక్కుతోన్న “కింగ్‌డమ్” జూలై 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అనిరుధ్‌కు విజయ్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోలో, విజయ్ తన “రౌడీ” బ్రాండ్ టీ షర్ట్ తో పాటు షటిల్ బ్యాట్ కూడా గిఫ్ట్‌గా అందజేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి సినిమా, మ్యూజిక్, మరియు లైఫ్ గురించి చర్చించారు. ఆ తర్వాత అనిరుధ్ ఆ టీషర్ట్ వేసుకుని, టీం మొత్తం కలిసి షటిల్ ఆడేలా కనిపించింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. “#Kingdom Boys – Ep 01” అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టయిన ఈ కంటెంట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. విజయం కోసం టీం చేసిన ఈ effort సినిమా పట్ల హైప్ పెంచేస్తోంది.