Mon. Oct 13th, 2025

కంటెంట్‌ బేస్డ్ సినిమాలకు వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా విలయ తాండవం అనే కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్బంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు హాజరయ్యారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘విలయ తాండవం’ టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. పోస్టర్‌ చూసే గూస్‌బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజు ఈ సినిమాతో పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథలనే ఎంచుకుంటారు. టైటిల్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మూవీ హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

హీరో కార్తీక్ రాజు – “ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకే ఆదరణ ఉంది. డైరెక్టర్ వాసు కొత్త కథ, కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీజర్, ట్రైలర్‌తో అందరూ సర్‌ప్రైజ్ అవుతారు” అన్నారు.

నిర్మాత గుంపు భాస్కర రావు మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ వాసు చెప్పిన కథ మాకు చాలా నచ్చింది. కథలో దమ్ముంది అని నాకు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మేం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించాం. మాకు మీడియా, ఆడియెన్స్ నుంచి ఆశీస్సులు లభిస్తాయని కాంక్షిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీఎస్ వాసు మాట్లాడుతూ .. ‘మా స్నేహితుడు సంజయ్ వల్లే ఈ మూవీ ప్రయాణం మొదలైంది. నాకు అండగా నిలిచి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలకు థాంక్స్. మా కోసం ఈ రోజు ఇక్కడకు వచ్చిన గౌర హరి, ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు గార్లకు థాంక్స్. ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన కార్తీక్ రాజుకి థాంక్స్. త్వరలోనే మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ మాట్లాడుతూ .. ‘కార్తిక్ రాజుతో ఇది వరకు నేను ‘అథర్వ’ మూవీకి పని చేశాను. అప్పటి నుంచి మా జర్నీ కొనసాగుతూనే ఉంది. ‘విలయ తాండవం’ సినిమాకు పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

The submit ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ లాంచ్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.