బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా నిలిచిన కల్కి 2898 ఏ.డి. బాక్సాఫీస్ దగ్గర రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో కల్కి 2 కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ ఊహించిందే కాకుండా మరింత అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ క్యారెక్టర్‌ను మరింత విభిన్నంగా తీర్చిదిద్దుతున్నట్లు చెబుతున్నారు.
మేకర్స్ కల్కి 2 షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నప్పటికీ, ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో కల్కి 2 ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు లేవని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్‌తో పాటు కీలక పాత్రలపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించి 25 శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. అందువల్ల వచ్చే ఏడాది కల్కి 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కల్కి 2 ఎలా ఉండబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.