హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “దీవాన”. ఈ చిత్రం నుంచి ‘ఇది ప్రేమ’ అనే మెలోడీ పాటను స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతరం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సాంగ్ లాంఛ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు నందినీ రెడ్డి, వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేసవిలో ‘దీవాన’ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో ఈశ్వర్ చంద్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ ఈవెంట్‌లో దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో నిజాయితీ కనిపించిందని, విజువల్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని ప్రశంసించారు. ‘తొలిప్రేమ’, ‘7జి బృందావన్ కాలనీ’ తరహాలో ఈ చిత్రం యువతకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ మొదటి సినిమా పేరు కూడా ‘దీవాన’ కావడం యాదృచ్ఛికమని, ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని హీరో హర్షిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి, థియేటర్లలో పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు.
The publish సమంత చేతుల మీదుగా ‘దీవాన’ చిత్రం నుంచి “ఇది ప్రేమ” సాంగ్ విడుదల first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
