Interesting Facts about Sushanth's Career
Interesting Facts about Sushanth's Career

పై ఫోటోలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? అతనే అక్కినేని సుశాంత్. టాలీవుడ్ లో ఫేమస్ హీరో. సినిమా ఇండస్ట్రీలో బలమైన నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చాడు. అయితే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే ఈ హీరో కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలున్నాయి.

లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో పాటు మాస్ సినిమాలకు సరిగ్గా సరిపోతాడీ మ్యాన్లీ హీరో. కేవలం సోలో హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఈ నటుడు మెప్పించాడు. అయితే గత 15 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా స్టార్ నటుడిగా మాత్రం ఎదగలేకపోయాడు. యాక్టింగ్ పరంగా ఏ వంక పెట్టలేకున్నా ఎందుకో గానీ ఇతర హీరోలతో పోలిస్తే బాగా వెనకబడిపోతున్నాడు.

అక్కినేని సుశాంత్ తండ్రి సత్య భూషణ రావు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయనతో చిన్నప్పుడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇందులో చాలా క్యూట్ గా కనిపించాడు సుశాంత్. సుశాంత్ తల్లి నాగ సుశీల నాగార్జునకు స్వయానా సొంత అక్క. 2008లో కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. ఆ తర్వాత కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకుందాంరా, చిలసౌ, ఇచ్చట వాహనములు నిలపరాదు తదితర సినిమాలతో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు.

అలవైకుంఠపురంలో, భోళా శంకర్, రావణాసుర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు సుశాంత్. అలాగే మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించాడు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాల గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *