
బాలీవుడ్ హీరో సోనూ సూద్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. కోవిడ్-19 నాటి నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన, ఇప్పటికీ అనేక మంది బాధితులకు సహాయం అందిస్తున్నారు. తాజాగా, ఆయన చేసిన ఒక గొప్ప నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సోనూ సూద్ తన కొత్త సినిమా బాక్సాఫీస్ వసూళ్లన్నీ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఆయన మంచి మనసును చూసి అభిమానులు గర్వంగా భావిస్తున్నారు. విలన్ పాత్రలు పోషించినా, నిజ జీవితంలో మాత్రం ఆయన అసలైన హీరో. ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు సహాయం, ఆసుపత్రి ఖర్చుల భారం తక్కువ చేయడం, చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం చేస్తూనే ఉన్నాడు.
ఇటీవల, చెన్నైలో ఓ వీధి భోజన స్థలం వద్ద సోనూ సూద్ చేసిన సరదా సంభాషణ వైరల్ అవుతోంది. ఆయన అక్కడ ఇడ్లీ, వడ తిని, ఆపై స్వయంగా దోసె వేసి చూసారు. ఫుడ్ స్టాల్ యజమానితో సరదా కామెడీ చేస్తూ, “నాకు డిస్కౌంట్ కావాలి” అని అడిగారు. దానికి ఆమె ₹5 తగ్గింపు ఇస్తా అని చెప్పడంతో, సోనూ కూడా తాను వేసిన దోసె ₹30 ఉండాలి అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
ఇక సినిమా విషయానికి వస్తే, సోనూ సూద్ ఇటీవల ఫతే అనే సినిమా తీసి, దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు. ఈ సినిమా సైబర్ క్రైమ్ కథాంశంతో రూపొందించగా, జనవరి 10న విడుదలైంది. ఆయన భార్య సోనాలి సూద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాల్లో విలన్ అయినా, నిజ జీవితంలో మాత్రం ఆయన లక్షలాది మంది మనసులు గెలుచుకుంటూ రియల్ హీరోగా నిలుస్తున్నారు.