
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “దిల్ రుబా”. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ వేడుకలో హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్ సందర్భంగా రుక్సార్ మాట్లాడుతూ – “స్టేజ్ మీద ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీయొద్దని గౌరవంగా కోరుతున్నా. అయినా కొంతమంది మీడియా వారు దాన్ని పట్టించుకోవడం లేదు. ఫోటోలు తీస్తుండటంతో నాకేం జరుగుతుందో మీరే చూస్తున్నారు” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు, రుక్సార్ తన అభిప్రాయాన్ని చెబుతూ – “మీరు ఎవరైనా అన్ కంఫర్ట్ గా ఉన్నప్పుడు, మరెవరైనా మీ ఫోటోలు తీస్తే మీరు ఊరుకుంటారా? ఇది తప్పా?” అని ప్రశ్నించారు. ఆమె మాటలు చాలా మందికి ఆలోచింపజేశాయి. హీరోయిన్లు ఫోటోలకు పర్మిషన్ ఇవ్వకుండానే వాటిని క్లిక్ చేయడంపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కొందరు రుక్సార్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇది మీడియా భాగమేనని అభిప్రాయపడుతున్నారు. అయితే రుక్సార్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలని కొందరు సినీ ప్రముఖులు కూడా పేర్కొన్నారు.