Mon. Oct 13th, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని బ్రూటల్ అవతారంలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణే స్థానంలో త్రుప్తి దిమ్రి ఫీమేల్ లీడ్‌గా నటించనుంది. అయితే, తాజాగా మలయాళ సుందరి మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
కానీ, ఈ సినిమాలో ఆమె సెకండ్ లీడ్‌గా వస్తుందా లేక నెగటివ్ షేడ్స్‌లో నటిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇకపోతే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో, సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

The submit ‘స్పిరిట్’లో ప్రేమమ్ బ్యూటీ.. ఎలాంటి పాత్ర చేస్తుందో..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.